ఇండిగో ఫ్లైట్ రద్దయిందా.. డోంట్ వర్రీ.. సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నయ్ !

ఇండిగో ఫ్లైట్ రద్దయిందా.. డోంట్ వర్రీ.. సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నయ్ !

ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ నుంచి దేశంలోని పలు నగరాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదనపు రైళ్లతో పాటు అదనపు బోగీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి రైల్వే నడుపుతుండటం గమనార్హం.

ఫ్లైట్ రద్దయి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఈ ప్రత్యేక రైళ్లను చెన్నై, బెంగళూరు నగరాలకు రైల్వే నడుపుతుండటం గమనార్హం. ఆ రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసింది. రైళ్ల వివరాలు ఇవే..