దీపావళికి 19 స్పెషల్‌‌‌‌ ట్రైన్లు

దీపావళికి 19 స్పెషల్‌‌‌‌ ట్రైన్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వింటర్ సీజన్, దీపావళి పండుగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. 19 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విల్లుపురం – సికింద్రాబాద్‌‌‌‌ – విల్లుపురం మధ్య 16 సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. నవంబర్‌‌‌‌, డిసెంబర్‌‌‌‌లోని అన్ని బుధవారాల్లో సాయంత్రం నాలుగు గంటలకు విల్లుపురంలో రైలు బయలుదేరుతుందని, అదే ట్రైన్‌‌‌‌ తిరిగి సికింద్రాబాద్‌‌‌‌లో నవంబర్‌‌‌‌, డిసెంబర్‌‌‌‌లలో అన్ని గురువారాల్లో రాత్రి 8గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ నెల 26న కాకినాడ టౌన్‌‌‌‌ – తిరుపతి – కాకినాడ టౌన్‌‌‌‌ మధ్య రెండు సర్వీసులు, కాకినాడ టౌన్‌‌‌‌ –  సికింద్రాబాద్‌‌‌‌కు ఒక సర్వీస్‌‌‌‌ నడపనున్నట్లు తెలిపింది.