ప్రజాపాలనకు స్పెషల్ వెబ్‌సైట్‌... ప్రారంభించనున్న సీఎం

ప్రజాపాలనకు స్పెషల్ వెబ్‌సైట్‌... ప్రారంభించనున్న సీఎం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రజాపాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌ (www.prajapalana.telangana.gov.in)ను సీఎం రేవంత్ రెడ్డి జనవరి 08వ తేదీన ప్రారంభించనన్నారు.  కాంగ్రెస్  అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన  కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది రోజుల పాటు అభయహస్తం కింద దరఖాస్తులు స్వీకరించింది.  ప్రతి 4 నాలుగు నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

అభయహస్తం స్కీమ్​లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాపాలన’ గ్రామసభలు నిర్వహించగా, కోటి 25 లక్షల అప్లికేషన్లు అందాయి. గతేడాది డిసెంబర్ 28 నుంచి దరఖాస్తుల  స్వీకరణ మొదలవగా శనివారంతో ముగిసింది. ఎనిమిది రోజుల పాటు గ్రామాల్లో, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో సభలు ఏర్పాటు చేశారు. వీటికి జనం పెద్దఎత్తున తరలివచ్చి గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

మొత్తంగా కోటి 25 లక్షల 84 వేల 383 దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ధరణి, ఇతర సమస్యలపై 20 లక్షల వరకు అర్జీలు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 17లోగా దరఖాస్తులన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్​వేర్​లో ఎంట్రీ చేయనున్నారు. రు.