చొక్కాలోకి పాము ఎలా దూరింది.. ఇది నిజంగా షాకింగ్

చొక్కాలోకి పాము ఎలా దూరింది.. ఇది నిజంగా షాకింగ్

పామును దూరం నుంచి చూస్తేనే.. ఒంటిపై జెర్రులు పాకినట్లు వణుకు పుడుతుంది. మరి అలాంటి పాము నిజంగానే ఒంటిపై పాకితే..! ఇంకేమైనా ఉందా? ఊపిరి ఆగిపోదూ..! ఈ వీడియోను చివరి వరకూ చూస్తే.. నిజంగానే ఊపిరి ఆగిపోతుంది. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్లు చూడకపోవడమే బెటర్! 

పని చేస్తూ అలిసిపోయినప్పుడో లేక ఖాళీ సమయంలో టైమ్ పాస్ కోసమో చెట్ల కిందకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడం చాలామంది ఇష్టపడుతుంటారు.  బాగా అలిసిపోయినప్పుడు చెట్ల కింద చల్లటి గాలికి తమకు తెలియకుండానే నిద్ర పట్టేస్తుంది కూడా. అలా ఓపెన్ ఏరియాలో చల్లటి గాలికి చెట్ల కింద ప్రకృతిని ఆస్వాదిస్తూ సేద తీరడానికి, నిద్రపోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ అలా చెట్ల కింద కూర్చోవడం, ఆదమరిచి నిద్రపోవడం కూడా ప్రమాదకరమే అని తాజాగా ఓ ఘటన నిరూపించింది. చెట్టు కింద కూర్చుని నిద్రపోతున్న ఓ వ్యక్తి చొక్కాలోకి ఓ నాగుపాము చొరబడింది.

అదృష్టం కొద్ది అతడికి ఈ భూమ్మీద నూకలు ఇంకా బాకీ ఉన్నాయి కనుక అతడు బతికి బట్టకట్టాడే కానీ లేదంటే నాగు పాము కాటుకు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియదు కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.  చెట్టు కింద చెట్టుకు ఒరిగి కూర్చుని హాయిగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆ వ్యక్తి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. అంతలోనే చెట్టు పై నుంచే  వచ్చిందో లేక మైదానంలోంచే వచ్చిందో తెలియదు కానీ ఓ నాగు పాము వచ్చి అతడి చొక్కాలోకి చొరబడింది. ఆ పాము చొక్కాలో వీపు వెనుక నుంచి పొట్టపైకి పాకుతూ వచ్చి చొక్కా గుండీల మధ్యలో ఉన్న గ్యాపులోంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో చూడవచ్చు. 

ఇంతలో అటు పక్కగా వెళుతున్న కొందరు అతనిని గమనించి అరవవద్దని చెబుతారు. అలాగే అతను నెమ్మదిగా ఒక్కొక్క బటన్ విప్పుతూ ఉంటే పాము కొంచెం బయటకు వస్తుంది. అయితే దాని తల మాత్రం షర్ట్ లోపలే ఉంటుంది. మళ్లీ ఏం జరుగుతుందా అని టెన్షన్.. అయితే ఆ వ్యక్తి చాలా చాకచక్యంగా కొంచెం పక్కకు జరిగి పాము బయటకు వెళ్లడానికి దారి ఇస్తాడు. దీంతో పాము అతనికి ఏ హాని చేయకుండా వచ్చిన దారినే వెళ్లిపోతుంది. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడినందుకు ఆ వ్యక్తితో పాటు మిగిలిన వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి తాగి ఎక్కడపడితే అక్కడ పడిపోతే ఇలా జరుగుతుంది అని కొందరు కామెంట్ చేస్తుంటే.. లక్ ఉండబట్టే బతికిపోయాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.