Cricket World Cup 2023: జడేజా తిప్పేసాడు: 10 బంతుల్లోనే 3 కీలక వికెట్లు

Cricket World Cup 2023: జడేజా తిప్పేసాడు: 10 బంతుల్లోనే 3 కీలక వికెట్లు

టీమిండియా స్టార్ అల్ రౌండర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలాన్ని చూపిస్తున్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ తో జరుగుతున్న తొలి మ్యాచులో అద్భుతమైన స్పెల్ తో ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ కి పంపాడు. చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో కేవలం 10 బంతుల్లోనే 3 ప్రధాన వికెట్లు తీసి భారత్  పట్టు బిగించేలా చేసాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ 27 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి కుదురుకున్నట్టు కనిపించినా జడేజా వచ్చేసరికి సీన్ అంతా మారిపోయింది. 28 వ ఓవర్ తొలి బంతికి స్టీవ్ స్మిత్ ని క్లీన్ బౌల్డ్ చేసాడు. విపరీతంగా టర్నయిన ఈ బాల్  స్మిత్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. 30 వ రెండో బంతికి లబు షేన్ ని అవుట్ చేసిన జడ్డూ.. నాలుగో బంతికి అలెక్స్ క్యారీని ఎల్బీడబ్ల్యూ చేసాడు. దీంతో ఒక్కసారిగా ఆసీస్ కష్టాల్లో పడింది.ముఖ్యంగా క్రీజ్ లో పాతుకుపోయిన స్మిత్ వికెట్ తీయడంతో ఆసీస్ పతనం మొదలైంది. 

ALSO READ : Cricket World Cup 2023: బాబోయ్ ఈ ఎండను తట్టుకోలేం: చెన్నైలో సూరీడు దెబ్బకు కుదేలైన వార్నర్,స్మిత్

జడేజా తో పాటు కుల్దీప్ యాదవ్, అశ్విన్ కూడా రాణించడంతో 37 ఓవర్లలో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ప్రస్తుతం క్రీజ్ లో స్టార్క్(0), కమ్మిన్స్(0) ఉన్నారు. ఆసీస్ ఇన్నింగ్స్ లో స్మిత్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిస్తే వార్నర్ 41, లబు షేన్ 27 పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జడేజాకు 3, కుల్దీప్ 2, అశ్విన్, బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది.