
న్యూయార్క్ : హెచ్–1బీ వీసా ద్వారా అమెరికాలో ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్న భారత్ సహా పలు దేశాల టెక్ నిపుణులకు ఊరట కలిగించేలా అమెరికా కోర్టు ఒకటి తీర్పు వెలువరించింది. హెచ్–1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములూ జాబ్ చేసుకోవడానికి మద్దతు తెలిపింది. మాజీ ప్రెసిడెంట్ ఒబామా హయాంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొలంబియా జిల్లా కోర్టు కొట్టేసింది. ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలు సత్యదూరంగా ఉన్నాయని జడ్జి తాన్యా చుట్కన్ వ్యాఖ్యానించారు.
హెచ్-1బీ వీసా కలిగిన వారి భాగస్వాములకు హెచ్–4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే, ఈ వీసాదారులకు జాబ్ చేసుకునే చాన్స్ కల్పించే మార్గదర్శకాలేవీ జారీ కాలేదని ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’ వాదించింది. దీంతో విభేదించిన కోర్టు.. కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారమే హెచ్-4 వీసాల జారీ జరుగుతోందని స్పష్టంచేసింది. హెచ్–1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు జాబ్స్ చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. కాగా, ఈ పిటిషన్‌ను అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు వ్యతిరేకించాయి. హెచ్–1బీ వీసాదారుల లైఫ్ పార్ట్నర్స్కు అమెరికా దాదాపు 1 లక్ష హెచ్–-4 వీసాలు జారీ చేసింది.
రష్యాలో అమెరికా రిపోర్టర్ అరెస్ట్
మాస్కో: గూఢచర్యం ఆరోపణలతో వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన అమెరికన్ రిపోర్టర్ ఒకరిని రష్యా టాప్ సెక్యూరిటీ ఏజెన్సీ అరెస్టు చేసింది. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత గూఢచర్యం ఆరోపణలతో యూఎస్ ప్రతినిధిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఇవాన్ గెర్ష్‌కోవిచ్ అనే రిపోర్టర్ యెకాటెరిన్బర్గ్లో రహస్య సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ గురువారం వెల్లడించింది. కాగా, ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో తమ ప్రతినిధి అరెస్ట్ పట్ల వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆందోళన వ్యక్తంచేసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ మాస్కో బ్యూరోలో కరస్పాండెంట్‌గా గెర్ష్‌కోవిచ్ రష్యా, ఉక్రెయిన్, ఇతర మాజీ సోవియట్ దేశాలను కవర్ చేస్తున్నాడు. అయితే, రష్యన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌కు సంబంధిం చిన సంస్థలలో ఒకదాని గురించి సమాచారాన్ని సేకరించడానికి అమెరికా ఆదేశాలకు అనుగుణంగా అతడు పనిచేస్తున్నాడని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపించింది.