చెన్నై: స్క్వాష్ వరల్డ్ కప్‌లో ఇండియా సెమీస్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఇండియా 3–0తో సౌతాఫ్రికాపై గెలిచింది. విమెన్స్ సింగిల్స్‌లో వెటరన్ జోష్న చినప్ప 7–4, 7–4, 7–2తో టీజెన్ రస్సెల్‌పై గెలిచింది. బలమైన షాట్లతో 13 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్ పెట్టింది.
మెన్స్ సింగిల్స్‌లో అభయ్ సింగ్ 7–1, 7–6, 7–1తో డేవ్లాడ్ వాన్ నీకెర్క్‌ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో అనహత్ సింగ్ 7–3, 7–3, 7–4తో హేలీ వార్డ్‌పై నెగ్గాడు. లీగ్ మ్యాచ్‌ల్లో ఇండియా వరుసగా స్విట్జర్లాండ్, బ్రెజిల్‌పై నెగ్గింది. మరో క్వార్టర్‌ఫైనల్లో ఈజిప్ట్ 3–0తో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.

