టైమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీకి గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తింపు

టైమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీకి గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తింపు

హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి, వెలుగు: ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ గుర్తింపు పొందిందని వర్సిటీ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరదా రెడ్డి తెలిపారు. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ -2026లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో గ్లోబల్ ర్యాంక్ 6,01,800, జాతీయ ర్యాంక్ 21, అలాగే, ఇంజినీరింగ్ విభాగంలో గ్లోబల్ ర్యాంక్ 6,01,800, జాతీయ ర్యాంక్ 18 సాధించిందని వెల్లడించారు. 

నాణ్యమైన విద్యా, బోధన, లెక్చరర్ల సహకారం, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, కోర్ ఇంజినీరింగ్ రంగాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితంగానే ఈ ర్యాంకింగ్ సాధ్యమైందని చెప్పారు. ఈ గ్లోబల్ గుర్తింపు ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యలో ఇండియా ప్రపంచ స్థాయిలో ఎదుగుతోందనడానికి ఈ వర్సిటీ ఉదాహరణగా నిలిచిందన్నారు. 

వీసీ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ, అకడమిక్స్, పరిశోధన, మౌలిక వసతులు, గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ యూనివర్సిటీ సాధిస్తున్న పురోగతికి ఈ గుర్తింపు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ అనుభవం కలిగిన లెక్చరర్లు, అత్యాధునిక సదుపాయాలు, పరిశోధనా సంస్కృతి ఈ విజయానికి ప్రధాన కారణమన్నారు. 

ఈ వర్సిటీలో వ్యవసాయం, బిజినెస్, కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఇంజినీరింగ్, సైన్సెస్, హ్యూమానిటీస్ అనే ఐదు స్కూల్స్ ఉన్నాయని తెలిపారు.