ఐఏసీసీ మొదటి మహిళా చైర్మన్‌‌‌‌ శ్రీదేవి

ఐఏసీసీ మొదటి మహిళా చైర్మన్‌‌‌‌ శ్రీదేవి

హైదరాబాద్, వెలుగు: ఇండో-–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) – ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ చాప్టర్   2025–26 అధ్యక్ష సంవత్సరానికి గాను   శ్రీదేవి దేవిరెడ్డిని చైర్మన్‌‌‌‌గా నియమించింది. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె మొదటి మహిళా చైర్మన్ కావడం విశేషం. ఆమె ఐఐఎం -కోజికోడ్‌‌‌‌లో చదివారు. భారత ప్రభుత్వం నుంచి నేషనల్ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్ అవార్డు, యూకే ప్రభుత్వం నుంచి చెవెనింగ్ ఫెలోషిప్ పొందారు. 

ప్రస్తుతం ఏఎస్‌‌‌‌ఐపీ టెక్నాలజీస్‌‌‌‌లో హెచ్‌‌‌‌ఆర్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌‌‌‌ విభాగాన్ని నడుపుతున్నారు. శ్రీదేవి  ఇండియా–అమెరికన్ వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడం, ఎంఎస్‌‌‌‌ఎంఈ అభివృద్ధి, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై దృష్టి పెడతారని సంస్థ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. కమిటీ సభ్యుల్లో  బీ ప్రభాకర్ రావు (ఫస్ట్ వైస్ చైర్మన్‌‌‌‌), శంకర్ కూనా (సెకెండ్ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌)తో పాటు వివిధ రంగాల నిపుణులు ఉన్నారు.