సినిమాలకు శ్రీలీల బ్రేక్..ఎందుకంటే?

 సినిమాలకు శ్రీలీల బ్రేక్..ఎందుకంటే?

టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. యంగ్ హీరోస్ తోనే కాకుండా,బాలకృష్ణ, మెగాస్టార్,పవన్ కళ్యాణ్ వంటి బడా హీరోస్ తో కూడా మూవీస్ చేస్తూ బిజీగా మారింది. 

ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం శ్రీలీల కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని సమాచారం. శ్రీలీల చేతిలో వరసగా పది సినిమాలకు పైగా ఉండటంతో గ్యాప్ తీసుకోవడానికి డిసైడ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ గ్యాప్ మధ్యలోనే తన ఎంబీబీస్ కోర్స్ ను కూడా కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఎంబీబీస్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండటంతో ఈ డెసీషన్ తీసుకున్నట్టు సమాచారం. 

శ్రీలీల తనలోని గ్రేసింగ్ డ్యాన్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆకట్టుకుంది. రవితేజ ధమాకా మూవీలో మోస్ట్ ఎనర్జీటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. దీంతో వరుస అవకాశాలు వస్తుండటంతో ఫ్యాన్స్ సైతం మస్తు ఖుషి అవుతున్నారు. ఇక శ్రీలీల ప్రస్తుతం మహేష్ బాబు తో గుంటూరు కారం, పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్, బాలకృష్ణ తో భగవంత్ కేసరి, రామ్ తో స్కంధ, నితిన్ తో ఎక్సట్రా, వైష్ణవ్ తేజ్తో ఆదికేశవ, విజయ్ దేవరకొండ తో మరో మూవీ ఇలా పలు హీరోలతో యాక్ట్ చేయడానికి డేట్స్ ఇచ్చింది. 

శ్రీలీల 2019లో కిస్ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్​గా తెరంగేట్రం చేసిన ఈ యంగ్ బ్యూటీ  పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఎనర్జిటిక్ డ్యాన్స్​లతో పాటు గ్లామర్ షోతో యూత్‌కు బాగా దగ్గరైంది. ఇంకేముంది టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూకట్టారు. 

శ్రీలీలకు కావలసిన బ్రేక్కు హీరోస్, డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్ అందరూ ఒకే అన్నట్లు సమాచారం. ఎందుకంటే శ్రీలీల కోసమే ప్రాజెక్ట్స్ రాసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి సందడి మూవీతో తెలుగు తెరకి పరిచయమయ్యి, తక్కువ టైంలోనే ఇంతటి ఫాలోయింగ్ ను పెంచుకున్న శ్రీలీల యాక్టింగ్కు కుదాస్ అంటుంటున్నారు ఫ్యాన్స్.