ఉప్పల్లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. ఆగిపోయిన సన్ రైజర్స్- లక్నో మ్యాచ్

ఉప్పల్లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. ఆగిపోయిన సన్ రైజర్స్- లక్నో మ్యాచ్

ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ , లక్నో మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఫ్యాన్స్ వల్ల కొద్దిసేపు ఆగిపోయింది.  హైదరాబాద్ అభిమానులు  లక్నో టీం మొత్తం కూర్చునే చోట నట్లు, బోల్టులు విసిరారు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ చర్యతో లక్నో టీం యాజమాన్యం షాక్ కు గురైంది. ఫ్యాన్స్  ప్రవర్తన పట్ల సన్ రైజర్స్, లక్నో టీమ్ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.  దీంతో 10 నిముషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. అయితే అక్కడే ఉన్న గంభీర్ కూర్చున్నాడు.  అతనిపై కోపంతో  అభిమానులు కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. 

 సన్ రైజర్స్  ఇన్నింగ్స్ 19వ ఓవర్లలో మ్యాచ్  ఆగిపోయింది.  థర్డ్ అంపైర్ రెండుసార్లు తప్పుగా నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యారు.  నోబాల్, వైడ్ బాల్స్ ను  ఫెయిర్ డెలివరీ అని చెప్పడంతో అభిమానులు థర్డ్ అంపైర్ ను  తిడుతూ వారి ముందున్న లక్నో డగౌట్ వైపు నట్లు విసిరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా 19వ ఓవర్‌ ఆవేశ్‌ ఖాన్‌ వేశాడు. ఈ ఓవర్‌లోని 5వ బంతిని అవేశ్ ఫుల్‌ టాస్‌ వేశాడు. నడుము పై భాగంలో వెళ్లినా... అంపైర్‌ నో బాల్‌ ఇవ్వలేదు. దీంతో సన్ రైజర్స్ ...ఈ నిర్ణయాన్ని చాలెంజ్‌ చేసింది. అల్ట్రా ఎడ్జ్‌లో పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ కూడా నో బాల్‌ ఇవ్వలేదు. దీంతో క్లాసెన్‌ సహా అబ్దుల్‌ సమద్‌ షాక్‌కు గురయ్యారు. క్లియర్‌గా నోబాల్‌ అని కనిపిస్తున్నా..థర్డ్‌ అంపైర్‌ కరెక్ట్‌ బాల్‌గా ఇవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. 

థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో  ఆగ్రహానికి  గురైన సన్‌రైజర్స్‌  ఫాన్స్.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ డగౌట్‌ వైపు నట్లు, బోల్ట్‌లు విసిరారు. అవి డగౌట్‌లో పడడంతో గందరగోళం నెలకొంది.మరోవైపు హెన్రిచ్ క్లాసెన్‌, క్వింటన్‌ డికాక్‌లు నోబాల్‌ వ్యవహారంపై చర్చించారు. అయితే అంపైర్లు కలగజేసుకొని డగౌట్‌ నుంచి ఆటగాళ్లను పంపించేశారు. దీంతో మ్యాచుకు కాసేపు అంతరాయం కలిగింది. దాదాపుగా ఓ 10 నిముషాలు మ్యాచ్ ఆగిపోయింది. అదే సమయంలో గౌతమ్ గంభీర్ కనిపించగానే.. ఫాన్స్ అందరూ 'కోహ్లీ కోహ్లీ' అని గట్టిగా అరిచారు. దీంతో గంభీర్ కూడా తీవ్ర అసహనానికి గురయ్యాడు.