IPL 2026 Tickets: సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు బిగ్ అప్ డేట్ వచ్చింది. ఐపీఎల్-2026 సీజన్లో ఎస్ఆర్హెచ్ ఆడే తొలి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ టికెట్లపై గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్ లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన హైదారాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో ఆరెంజ్ ఆర్మీ పోటీ పడబోతుంది. కాగా ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లను ఈరోజు (2026, మార్చి 26) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది.
ఎస్ఆర్హెచ్ అభిమానులు డిస్ట్రిక్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పేర్కొనింది. రెండు టికెట్లు కొనుగోలు చేస్తే ఒక సన్ రైజర్స్ టీమ్ జెర్సీని ఫ్రీగా పొందొచ్చు అని తెలిపింది. అయితే బీసీసీఐ తొలుత కేవలం 20 మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే రిలీజ్ చేయడంతో.. ఆరెంజ్ ఆర్మీ తొలి విడతలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ని మాత్రమే తమ సొంత మైదానంలో ఆడనుంది. ఇక ఈ ఏడాది సీజన్ ఆరంభంలో జరిగే మ్యాచులకి రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా దూరం అయ్యాడు.
దీంతో ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్థానంలో టీ20 వరల్డ్ కప్ లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ కి జట్టు పగ్గాలను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అందించింది. ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్ లో మార్చి 28వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ తో తలపడనుంది. ఇప్పటికే ఆరెంజ్ ఆర్మీ జట్టు బెంగళూరుకు చేరుకుని తీవ్రంగా శ్రమిస్తుంది. కాగా మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
