Lalit Modi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌కు ముందు జట్ల లీగ్ విలువలపై తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోడీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ భారీగా పెరగడం వెనుక ఉన్న క్రెడిట్ విషయంలో గోయెంకా చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి. ఇటీవలే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడయ్యాయి.
భారీ ధరలకు అమ్ముడైన ఆర్సీబీ, ఆర్ఆర్:
* RCB: ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, మరియు బ్లాక్‌స్టోన్‌లతో కూడిన కన్సార్టియం ఆర్సీబీని సుమారు రూ.16,600 కోట్ల ($1.78 బిలియన్ల)కు దక్కించుకుంది.
* RR: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సుమారు సుమారు రూ. 15,000 కోట్లకు పైగా ($1.63 బిలియన్ల) ధరకు అమ్ముడైంది. కాల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును కొనుగోలు చేసింది.
వివాదం ఎక్కడ మొదలైంది?:
ఐపీఎల్ ఫ్రాంచైజీల అద్భుతమైన వృద్ధిని కొనియాడుతూ సంజీవ్ గోయెంకా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. అందులో ఐపీఎల్ యొక్క అద్భుతమైన ఆర్కిటెక్చర్, మీడియా హక్కుల నిర్మాణం, ఐసీసీ ఛైర్మన్ జై షా విజన్ వల్లే ఈ స్థాయి వాల్యుయేషన్ సాధ్యమైందని పేర్కొన్నారు. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ పేరును ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహా మేరకు జట్టు ఫలితాల గురించి కాకుండా ప్రక్రియ గురించి మాట్లాడాలనే ధోరణిలో గోయెంకా కేవలం ప్రస్తుత పాలనను మాత్రమే ప్రశంసించడం గమనార్హం.
లలిత్ మోడీ రియాక్షన్:
తన పేరును విస్మరించడంపై లలిత్ మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గోయెంకాను "క్లౌన్" (కోతివేషాలు వేసేవాడు) అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యక్తికి అసలు ఐపీఎల్ మోడల్‌ను ఎవరు రూపొందించారో మర్చిపోయే 'మెమరీ లాస్' వ్యాధి ఉన్నట్లుందని మండిపడ్డారు. ఫర్వాలేదు సంజీవ్ తన సొంత ప్రపంచంలోనే బ్రతుకుతున్నాడని పేర్కొన్నాడు. కాగా @DrSanjivGoenka ఒక జోకర్ అని మనందరికీ తెలుసు అంటూ ఫైర్ అయ్యాడు. ఆయన సోదరుడు హర్ష్ గోయెంకా ఈ ఫ్రాంచైజీకి యజమాని అయితే బాగుండేది, అతడు నిజమైన క్రికెట్ ప్రేమికుడని చెప్పుకొచ్చాడు. తన ట్వీట్ చరిత్రను మారుస్తుందని అనుకునే వ్యక్తి కాదన్నారు.
ఐపీఎల్ 2026 ప్రారంభం
మరోవైపు, ఐపీఎల్ 2026 సీజన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే బ్లాక్ బస్టర్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ప్రస్తుతం మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. మిగిలిన షెడ్యూల్ ని త్వరలోనే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది.
Seriously this guy really has a memory loss of who conceived the model. Thats ok. He just lives in his own world. We all know that 🤣🤣🤣 @DrSanjivGoenka is a 🤡
— Lalit Kumar Modi (@LalitKModi) March 26, 2026
wish it was his brother @hvgoenka who owned the ipl franchise. He is a true cricket fan. Not this clown - who thinks… https://t.co/m8eBdAOHHX
