SRH vs MI: ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా

SRH vs MI: ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా

సొంతగ్రౌండ్ లో తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసి ఆస్వాదించాలనే కోరికను కొంతమంది ఆసరాగా చేసుకుని దందాకు తెరలేపారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగింది. డైరెక్ట్ గా మ్యాచ్ చూడాలన్న క్రికెట్ ఫాన్స్ కోరికను కొందరు క్యాష్ చేసుకున్నారు. HCA జారీ చేసిన పాస్ లు పక్కదారి పట్టాయి. కాంప్లిమెంటరీ పాస్ లను బ్లాక్ లో అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 

ఉప్పల్ వేదికగా కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై మధ్య మ్యాచ్ జరగనుంది. హోంగ్రౌండ్ లో బోణీకొట్టాలని హైదరాబాద్ భావిస్తుండగా.. ఈ మ్యాచ్ లో గెలవాలని ముంబై తాపత్రయ పడుతోంది. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచ్ లు ఆడగా.. తొమ్మిదింట్లో సన్ రైజర్స్, పన్నెండు మ్యాచ్ లలో ముంబై గెలిచింది. రెండు జట్లు బలాబలాల్లో సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.

ఐపీఎల్  లీగ్  మొదలైన ఐదు రోజుల తర్వాత సన్ రైజర్స్  హైదరాబాద్  సొంత ఇలాఖాలో తొలి పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్ లో కోల్ కత్తాతో  చేతిలో విజయానికి దగ్గరగా వచ్చినా ఆఖర్లో తడబడి ఓడింది SRH టీమ్. దీంతో ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కమిన్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన SRH...అతడిపై భారీ అంచనాలే పెట్టుకుంది. మరోవైపు  మొదటి మ్యాచ్ లో గుజరాత్  చేతిలో ఓడిన ముంబై.. ఇవాళ జరిగే పోరులో హైదరాబాద్ కు షాకివ్వాలని చూస్తున్నది. అయితే ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు జరిగిన ఈ సీజన్ లో హోంగ్రౌండ్ లో మ్యాచ్  ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. ఉప్పల్  స్టేడియంలో స్థానిక పరిస్థితులను SRH... ఏ మేరకు వినియోగించుకుంటుందో చూడాలి.