ఓడితే ఇంటికి..గెలిస్తే ప్లేఆఫ్కు.. రైజర్స్ వర్సెస్ రాయల్స్..ఏది గెలుస్తుంది..

ఓడితే ఇంటికి..గెలిస్తే  ప్లేఆఫ్కు.. రైజర్స్ వర్సెస్ రాయల్స్..ఏది గెలుస్తుంది..

ఓడితే ఇంటికి..గెలిస్తే ప్లేఆఫ్కు..ప్రస్తుతం ఆర్సీబీ టీమ్ పరిస్థితి. ఐపీఎల్ 2023లో  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఉప్పల్లో జరిగే జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. బెంగుళూరుకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో బెంగుళూరు బరిలోకి దిగుతోంది. 

అనూహ్యంగా ఫ్లేఆఫ్ రేసులోకి..

ఆర్సీబీ తన చివరి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించింది. అద్భుత ప్రదర్శనతో  రాజస్థాన్ రాయల్స్‌పై 112 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దీంతో తన నెట్ రన్ రేట్‌ను -0.344 నుచి 0.166గా మార్చుకుంది.  ఇదే జోరుతో  రాజస్థాన్‌ను వెనక్కునెట్టి అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. ఇదే జోరును హైదరాబాద్ మ్యాచ్ లోనూ కొనసాగించి గెలిచి ప్లేఆఫ్ బెర్తును దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.

టీమ్ ఎలా ఉంది...గెలుస్తుందా..

ఆర్సీబీ జట్టులో కెప్టెన్ డుప్లెసిస్,  మ్యాక్స్‌వెల్  సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అయితే కీలక ప్లేయర్ కోహ్లీ విఫలమవడం జట్టును కలవరపాటుకు గురిచేస్తోంది. . గత రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ విఫలమయ్యాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ ఫాంలోకి వస్తే ఆర్సీబీ ఈజీగా ప్లేఆఫ్ చేరుతుంది. ఫినిషనర్ గా పేరొందిన దినేష్ కార్తీక్ కూడా విఫలమవుతున్నాడు. ఆకట్టుకుంటాడనుకున్న బ్రేస్ వెల్ అంతంత మాత్రమే రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ మ్యాచులో అయినా వీరు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అటు బౌలింగ్ లో లోకల్ బాయ్ సిరాజ్ అద్బుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఉప్పల్‌లో ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అదే జోరును కొనసాగిస్తే సన్‌రైజర్స్‌కు తిప్పలు తప్పవు. వీరికి తోడు హర్షల్ పటేల్, కర్ణ శర్మ పర్వాలేదనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి హైదరాబాద్ పై ఆర్సీబీ బౌలింగ్ విభాగం విరుచుకుపడితే బెంగుళూరు ఫ్లేఆఫ్  వెళ్లడం కష్టమేమి కాదు. 

సన్ రైజర్స్ పరిస్థితి ఏంటీ..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది నామమాత్రపు మ్యాచ్. గెలిచినా..ఓడినా ఆ జట్టుకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న హైదరాబాద్..ఈ మ్యాచులో గెలిచి తనతో పాటు.. ఆర్‌సీబీని ఇంటికి  తీసుకెళ్లాలనుకుంటోంది. అయితే ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీని  

పిచ్ ఎలా ఉంటుంది..

ఉప్పల్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.  ఒకవైపు బౌండరీ లైన్ చిన్నగా ఉంటుంది.. కాబట్టి బ్యాట్స్ మన్ కు స్వర్గధామం. ఈ పిచ్ పై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ విజయాలు సాధించాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవడానికే మొగ్గు చూపనుంది. ఒక వేళ ఆర్‌సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి భారీ టార్గెట్‌ను ఉంచితే హైదరాబాద్‌ను ఈజీగా  ఓడించవచ్చు.