మియాపూర్ ​ ఇస్కాన్ టెంపుల్ లో 26న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

మియాపూర్ ​ ఇస్కాన్ టెంపుల్ లో 26న  శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

హైదరాబాద్, వెలుగు: మియాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నెల 26న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు టెంపుల్​ప్రెసిడెంట్ శ్రీరామ్ దాస్ ప్రభూజీ తెలిపారు. మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ కమ్యూనిటీ హాల్​లో వేడుకలు ఉంటాయని చెప్పారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి11 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. 

ఉచిత అన్న ప్రసాదం పంపిణీ ఉంటుందన్నారు. వలంటీర్లుగా పనిచేసేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. అలాగే 27న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నందోత్సవం, శ్రీల ప్రభుపాద శ్యాస పూజ ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.