ఆగస్టు 31న శ్రీలంక, బంగ్గాదేశ్‌‌ మధ్య ఆసియా కప్‌‌ మ్యాచ్

ఆగస్టు 31న  శ్రీలంక, బంగ్గాదేశ్‌‌ మధ్య ఆసియా కప్‌‌ మ్యాచ్
  • మ. 3 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో
పల్లెకెలె : గాయాలతో సతమతం అవుతున్న శ్రీలంక, బంగ్గాదేశ్‌‌ జట్లు ఆసియా కప్‌‌లో తమ తొలి పోరుకు సిద్ధమయ్యాయి. గ్రూప్‌‌-బిలో భాగంగా గురువారం జరిగే మ్యాచ్‌‌లో ఇరు జట్లూ శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. టీ20 ఫార్మాట్‌‌లో జరిగిన గత ఎడిషన్‌‌లో విజేతగా నిలిచిన లంక జట్టులో పలువురు గాయాలు, కరోనా బారిన పడ్డారు. దాంతో, టోర్నీకి ఒక రోజు ముందు వరకూ టీమ్‌‌ను ప్రకటించలేకపోయింది. 

పైగా ఈ ఏడాది వన్డేల్లో లంక ఆట అంతంత మాత్రంగానే ఉంది. బంగ్లాపై నెగ్గి విజయంతో టోర్నీని ఆరంభించాలంటే నిశాంక, దిముత్‌‌ కరుణరత్నె, అసలంకతో పాటు బౌలర్లు తీక్షణ, కసున్‌‌ రజిత రాణించాల్సి ఉంది. బంగ్లా కూడా గాయాలకు గురైన తమీమ్‌‌ ఇక్బాల్‌‌, ఎబాదత్‌‌తో పాటు వైరల్‌‌ ఫీవర్‌‌తో లిటన్‌‌ దాస్‌‌ సేవలను కోల్పోయింది. కెప్టెన్‌‌ షకీబ్‌‌, ముష్ఫికర్‌‌ రహీమ్‌‌, నజ్ముల్‌‌ శాంటోపై బంగ్లా ఆశలు పెట్టుకుంది.