కెప్టెన్‌గా డెబ్యూ మ్యాచ్‌లోనే కుమ్మేసిన కుశాల్ మెండిస్.. వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం 

కెప్టెన్‌గా డెబ్యూ మ్యాచ్‌లోనే కుమ్మేసిన కుశాల్ మెండిస్.. వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం 

SL vs WI: క్రికెట్ ఫ్యాన్స్ అంతా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గాయాల టెన్షన్‌లో ఉంటే.. అక్కడ కింగ్‌స్టన్ వేదికగా జరిగిన శ్రీలంక వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. లంక జట్టు ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపి 41 రన్స్ తేడాతో విండీస్‌ను ఓడించింది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

లంక బ్యాటర్ల రచ్చ.. బోర్డుపై 300+ రన్స్: 
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఓపెనర్ పతుమ్ నిస్సాంక (103 బంతుల్లో 79) బలమైన పునాది వేయగా, ఆ తర్వాత కెప్టెన్ కుసాల్ మెండిస్ వన్-సైడ్ గేమ్‌తో రెచ్చిపోయి కేవలం 62 బంతుల్లోనే 72 రన్స్ చేశాడు. మిడిల్ ఓవర్లలో చరిత్ అసలంక (45) సపోర్ట్ ఇవ్వగా.. చివర్లో జనిత్ లియనాగే 44 రన్స్ చేసి నాటౌట్‌గా నిలవడంతో లంక స్కోరు 300+ మార్క్‌ని అందుకుంది. కరేబియన్ బౌలర్లలో రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

చమీరా స్పెల్‌కు ఖేల్ ఖతామ్: 
304 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్.. స్టార్టింగ్‌లో బాగానే ఆడింది. ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ (38 బంతుల్లో 45), కెప్టెన్ షాయ్ హోప్ (66 బంతుల్లో 56) బాధ్యతాయుతంగా ఆడుతూ లంక బౌలర్లపై ప్రెజర్ పెట్టారు. కానీ మిడిల్ ఓవర్లలో లంక పేసర్ దుశ్మంత చమీరా అసలు పిక్చర్ చూపించాడు. తన పవర్‌ఫుల్ బౌలింగ్‌తో విండీస్ బ్యాటింగ్ లైన్‌అప్‌ను పూర్తిగా కొల్లాప్స్ చేశాడు. కీసీ కార్టీ (27), రోస్టన్ చేజ్ (33), గుడకేష్ మోటి (22) కాసేపు క్రీజులో నిలబడినా.. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో వెస్టిండీస్ కోలుకోలేకపోయింది. చివర్లో షమర్ జోసెఫ్ (23) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు.. విండీస్ 49.2 ఓవర్లలో 262 రన్స్ కే ఆలౌట్ అయింది.

లంక నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్: 
శ్రీలంక బౌలర్లలో చమీరా ఒంటరిగా 4 వికెట్లు పడగొట్టి విండీస్ నడుం విరవగ్గా, స్పిన్నర్ మహేష్ తీక్షణ రెండు వికెట్లు తీసుకోగా, వనిందు హసరంగా, చరిత్ అసలంక తలో వికెట్ తీసి విండీస్ ని ఓడించారు. కాగా కెప్టెన్సీ ప్రెజర్‌ని పక్కన పెట్టి.. బ్యాటింగ్‌లో 72 రన్స్‌తో అదిరిపోయే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన  కుశాల్ మెండిస్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.