ఫుడ్ ఎమర్జెన్సీ ప్రకటించిన శ్రీలంక ప్రభుత్వం

ఫుడ్ ఎమర్జెన్సీ ప్రకటించిన శ్రీలంక ప్రభుత్వం

శ్రీలంకలో తీవ్ర ఆహార కొరత  ఏర్పడింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం ఫుడ్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రైవేటు బ్యాంకుల్లో విదేశీ మారక నిలువలు కూడా తగ్గిపోవడంతో.. సరుకు దిగుమతులకు కూడా సమస్య ఏర్పడింది. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్లు అధ్యక్షుడు గొటబయ రాజపక్స తెలిపారు. ఈ క్రమంలో అత్యయిక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. చక్కర, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను నిల్వ చేసేవారి పట్ల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వరి, బియ్యం, చక్కర, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాను సమీక్షించేందుకు ఓ ఆర్మీ ఆఫీసర్‌ను కమిషనర్‌గా నియమిస్తూ రాజపక్ష ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా షుగర్‌, బియ్యం, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కిరాణా షాపుల దగ్గర భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరుతున్నారు. పౌల పౌడరు, కిరోసిన్‌, వంట గ్యాస్ స్టోర్ల దగ్గర కూడా జనం క్యూ కట్టడం ఆందోళన కలిగిస్తున్నది. నిత్యావసరాలను హోర్డింగ్ చేస్తున్నవారిపై భారీగా జరిమానా వసూల్ చేస్తున్నారు. కరోనా వైరస్ తో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. శ్రీలంక విదేశీ మారక నిలువలు గడిచిన రెండేళ్లలో 7.5 బిలియన్ల డాలర్ల నుంచి 2.8 బిలియన్ల డాలర్లకు పడిపోయింది.