లంకదే తొలి టీ20.. బంగ్లాదేశ్పై గెలుపుతో ఆధిక్యంలోకి

లంకదే తొలి టీ20.. బంగ్లాదేశ్పై గెలుపుతో ఆధిక్యంలోకి

పల్లెకెలె: టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో కుశాల్‌‌‌‌ మెండిస్‌‌‌‌ (73), పాథుమ్‌‌‌‌ నిశాంక (42) చెలరేగడంతో.. బంగ్లాదేశ్‌‌‌‌తో గురువారం (జులై 10) జరిగిన తొలి టీ20 మ్యాచ్‌‌‌‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్‌‌‌‌ ఓడిన బంగ్లా 20 ఓవర్లలో 154/5 స్కోరు చేసింది. 

పర్వేజ్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ ఎమన్‌‌‌‌ (38) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. మహ్మద్‌‌‌‌ నయీమ్‌‌‌‌ (32 నాటౌట్‌‌‌‌), మెహదీ హసన్‌‌‌‌ మిరాజ్‌‌‌‌ (29) ఫర్వాలేదనిపించారు. మహీశ్‌‌‌‌ తీక్షణ 2 వికెట్లు తీశాడు. తర్వాత లంక 19 ఓవర్లలో 159/3 స్కోరు చేసి నెగ్గింది. నిశాంకతో తొలి వికెట్‌‌‌‌కు 78 రన్స్‌‌‌‌ జోడించిన కుశాల్‌‌‌‌ మెండిస్‌‌‌‌.. కుశాల్‌‌‌‌ పెరీరా (24)తో రెండో వికెట్‌‌‌‌కు 44 రన్స్‌‌‌‌ జత చేశాడు.

 చివర్లో అవిష్క ఫెర్నాండో (11 నాటౌట్‌‌‌‌), చరిత్‌‌‌‌ అసలంక (8 నాటౌట్‌‌‌‌) విజయాన్ని అందించారు. సైఫుద్దీన్‌‌‌‌, మెహిదీ హసన్‌‌‌‌, రిషాద్‌‌‌‌ తలా ఓ వికెట్ తీశారు. కుశాల్‌‌‌‌ మెండిస్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.