Srilanka : చెత్త రికార్డు సృష్టించిన శ్రీలంక

Srilanka :   చెత్త రికార్డు సృష్టించిన శ్రీలంక

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో శ్రీలంక పోరాడి ఓడిన విషయం తెలిసిందే. మ్యాచ్, సిరీస్  ఓడిపోయినా పోరాటస్ఫూర్తితో లంక జట్టు ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ మ్యాచ్ ఓటమితో శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వన్డేల్లో అత్యధిక సార్లు ఓడిన జట్టుగా లంక నిలిచింది. అయితే ఆ తరువాతి స్థానంలో భారత్ ఉంది.

ఇప్పటివరకు 880 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక 437 ఓటములతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. 1022 మ్యాచ్‌ల ఆడిన భారత్ 436 సార్లు ఓడిపోయి రెండో ప్లేస్ లో నిలిచింది.  ఇక  టీ20ల్లో కూడా ఈ రికార్డు శ్రీలంక పేరిటే ఉంది. 94 టీ20 మ్యాచుల్లో ఆ జట్టు  ఓడిపోయింది.

టీమిండియా చేతిలో ఎక్కువసార్లు ఓడిపోయిన జట్టు కూడా శ్రీలంకనే కావడం గమనార్హం. వన్డేల్లో 95 సార్లు, టీ20ల్లో 19 సార్లు భారత్ చేతిలో లంక క్రికెట్ జట్టు ఓటమిపాలైంది. సనత్ జయసూర్య, మహేల జయవర్ధనే, కుమార సంగక్కర వంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత లంక జట్టు వన్డేల్లో తన ఉనికిని కోల్పోయింది.