కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, ధరలపై పెరుగుతున్న ఆందోళనలను అణచివేయడం కోసం దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశంలో ఎమర్జెన్సీ శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వచ్చిందని ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు మరోసారి ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలిపారు. అయితే, గోటబయ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన స్టూడెంట్లపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ లను ప్రయోగించారు. దీంతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేసేందుకు ఐదు వారాల్లోనే రెండోసారి ఎమర్జెన్సీ విధిస్తూ భద్రతా బలగాలకు గోటబయ అధికారాలను కల్పించారని పేర్కొంటున్నారు.
