శ్రీలంక టూ చిత్తూరు.. మరో ఆన్ లైన్ ప్రేమాయణం.. చివరకు పోలీసులు ట్విస్ట్

శ్రీలంక టూ చిత్తూరు.. మరో ఆన్ లైన్ ప్రేమాయణం.. చివరకు పోలీసులు ట్విస్ట్

సోషల్ మీడియా ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడెక్కడివారిలో సోషల్ మీడియా కలిపేస్తోంది. దీనికి దేశ సరిహద్దులు..సముద్రాలు అనే ఎల్లలు లేవు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ప్రేమలుగా మారుతున్న వైనాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ సరిహద్దులే కాదు సముద్రాలు కూడా దాటేసి ప్రేమికులను కలుస్తున్నారు. వివాహాలు చేసుకుంటున్నారు.  తాజాగా శ్రీలంక అమ్మాయి చిత్తూరు వచ్చి ఫేస్‌బుక్ ప్రియుడిని పెళ్లాడింది.

చిత్తూరు జిల్లా, వి.కోట మండలం, ఆరిమాకులపల్లి  చెందిన లక్ష్మణ్‌  అనే వ్యక్తికి  శ్రీలంక దేశస్థురాలు విఘ్నేశ్వరి   ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. అదికాస్తా ప్రేమ దారితీసింది. అతడిని పెళ్లి చేసుకోవాలని భావించిన విఘ్నేశ్వరి  లక్ష్మణ్ కోసం దేశ సరిహద్దులు దాటి.. సముద్రం దాటి అరిమాకులపల్లె వచ్చింది. ఎక్కడ శ్రీలంక..? ఎక్కడ అరిమాకుల పల్లి..? కానీ ఈ యువతి సాహసం వెనుక ఉన్నది ప్రేమ.   దీంతో జులై  8 న పర్యాటక వీసా ద్వారా విఘ్నేశ్వరి చెన్నైకి చేరుకుంది.లక్ష్మణ్ అక్కడి నుంచి అమ్మాయిని స్వగ్రామానికి తీసుకొచ్చాడు .వారి ప్రేమ విషయం తెలిసిన పెద్దలు  వారిద్దరికి జులై 20 న సాయిబాబా ఆలయంలో వివాహం చేశారు. కుటుంబంలో కలిసిపోయింది.  ఇక్కడి వరకు బాగానే ఉంది.

ఇంతలో వీరి వివాహం విషయం కాస్తా పోలీసులకు చేరింది. శ్రీలంకకు చెందిన యువతి చిత్తూరు యవకుడిని పెళ్లి చేసుకుందనే వార్తలు విన్న పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అరిమాకులపల్లికి వచ్చారు. విషయం గురించి ఆరా తీశారు. ఆమె పాస్ పోర్టు, వీసా అన్నీ చెక్ చేశారు. వీసా గడువు ఎప్పటి వరకు ఉందో తెలుసుకున్నారు. వీసా గడువు ఆగస్టు 6 వరకు ఉందని గుర్తించారు. గడువు ముగిసాక శ్రీలంక వెళ్లిపోవాలని నోటీసులిచ్చారు. యువతిని రిజిస్టర్ వివాహం చేసుకుని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాలని యువకుడి తల్లిదండ్రులను కోరారు. 

పర్యాటక వీసా త్వరలో ముగిసిన వెంటనే  వెంటనే స్వదేశానికి వెళ్ళిపోవాలని జిల్లా ఎస్పీ ద్వారా  స్థానిక పోలీసులు  ఆమెను హెచ్చరించారు. ఇక అంతే వారిలో అయోమయం నెలకొంది.ఏమి చేయాలో పాలుపోలేదు.ఈ విషయం బయటకు వచ్చింది.విడిపోతామన్న భయం ప్రేమికులు పట్టుకుంది.ఆ కుటుంబంలో భయాందోళన నెలకొంది.భారత ప్రభుత్వం వీసా గడువును పెంచి ప్రేమను నిలబెట్టాలని బాధితులు కోరుతున్నారు. 
ప్రస్తుతం ఈ విషయం చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బాధిత యువతి వీసా గడువు పెంచేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.