
కొలంబో: శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. లిమిటెడ్ ఓవర్స్‌లో ఎక్కువ కాలం ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. హసరంగ రిటైర్మెంట్‌ను లంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) అంగీకరించింది. ‘హసరంగ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. వైట్‌బాల్ క్రికెట్‌లో అతను భిన్నమైన పాత్రను పోషిస్తాడని ఆశిస్తున్నాం’ అని ఎస్‌ఎల్‌సీ సీఈవో ఆష్లే డి సిల్వా వెల్లడించారు. 2020లో సౌతాఫ్రికాపై అరంగేట్రం చేసిన హసరంగ కెరీర్‌లో నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. తన లెగ్ స్పిన్‌తో 4 వికెట్లు పడగొట్టాడు. 2021లో పల్లెకెల్‌లో బంగ్లాదేశ్‌పై చివరి టెస్టులో పాల్గొన్నాడు. ఇక లిమిటెడ్ ఓవర్లలో హసరంగ మంచి స్పిన్నర్‌గానే కాకుండా లోయర్ ఆర్డర్‌లో ఉపయుక్తమైన బ్యాటర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు.