రాజీనామా చేయకుండా మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సింగపూర్ దేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ప్రత్యేక విమానంలో ఫ్యామిలీతో మాల్దీవులకు పారిపోయిన గొటబయ..అక్కడ సేఫ్ కాదని భావించి..సింగపూర్ కు చెక్కేసినట్లు శ్రీలంక మీడియా వెల్లడించింది. సౌదీ అరేబియాకు చెందిన SV788 విమానంలో మాలే నుంచి బయలుదేరారని పేర్కొంది. గొటబాయ రాత్రి 7 గంటలకు వరకు చేరుకుంటారని తెలుస్తోంది.
లంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జులై 13న అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని గొటబయ ప్రకటించినా..ఇంత వరకు రాజీనామా చేయలేదు. అయితే తనను సురక్షితంగా దేశం దాటిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించిన రాజపక్స..సింగపూర్ చేరిన తర్వాత రాజీనామా చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం లంకలో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అయితే రాజపక్స రాజీనామా అందిన వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జన బలవేగయ పార్టీ యోచిస్తోంది. అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని సాజిత్ ప్రేమదాస్ భావిస్తున్నట్లు సమాచారం. గొటబాయ రాజీనామా చేయకపోతే ఏం చేయాలన్న దానిపై స్పీకర్ మహింద అభేవర్థనే కసరత్తు చేస్తున్నారని లంక మీడియా వెల్లడించింది.
శ్రీలకం రాజధాని కొలంబోలో ప్రజల ఆందోళన కొనసాగుతోంది. ప్రధాని కార్యలయాన్ని నిరసనకారులు ముట్టిడించారు. ప్రభుత్వ భవనాలను ఆక్రమించారు. అయితే వారిని బయటకు పంపేందుకు పోలీసులు, ఆర్మీ ప్రయత్నించింది. చివరకు నిరసన కారులు ప్రధాని భవనాన్ని ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని పలువురు పిలుపునిచ్చారు. అవన్నీ 200 ఏళ్ల నాటి ఆస్తులని.. వాటిని ధ్వంసం చేయొద్దని కోరారు.
