
రాముడు పరిపూర్ణ మానవుడు. ఈ నేలమీద నడిచిన దేవుళ్లందరిలోకి చాలా గొప్పవాడిగా భక్తులందరూ భావించే ధర్మావతారుడు. అలాంటి రాముడు పుట్టిన చోటైన అయోధ్యలో మందిరం కడుతున్నారంటే… అక్కడి జనాల్లో ఆనందానికి హద్దులు లేకుండా ఉంది. నిత్యం 15,000 మంది భక్తులు వస్తున్నట్లు అంచనా. రామ నవమి, దసరా వంటి పండుగల రోజుల్లో రెండున్నర లక్షల మంది వరకు వస్తుంటారు. రామాలయం పూర్తయితే తమ ప్రాంతానికి ప్రపంచవ్యాపంగా గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారు. ఇక, వ్యాపారుల్లోనైతే రాముని దయతో తమ జీవితాలు మారిపోతాయన్న ఆశ అంతా ఇంతా కాదు. వీళ్లలో పూలు అమ్ముకునేవాళ్లు, ప్రసాదాలు, ఫొటోలు, చేతి కడియాలు, తలకు చుట్టుకునే రామ్‌లాలా బ్యాండ్లు, సావనీర్లు వంటివి అమ్మేవాళ్లు ఉన్నారు. లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్ పెరుగుతుందన్న భరోసాతో రిక్షాపుల్లర్ల మొదలుకొని ప్రైవేటు ట్యాక్సీ ఆపరేటర్ల వరకు అందరూ ఆశపడుతున్నారు. అయోధ్యలో తాత్కాలికంగా గుడారంలో ఏర్పాటు చేసిన రామ్‌లాలా విగ్రహాలకు పూజలు జరపడం, దర్శనం చేసుకోవడం జరుగుతోంది. ఇకమీదట శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శాశ్వత రామాలయం నిర్మాణం చేపట్టబోతోంది. సుమారు 67.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే రామ మందిరం ప్రపంచంలోనే అతి పెద్దది కానుంది. ఇది కేవలం భక్తికి సంబంధించిన కట్టడంగానే ఉండదు. భవిష్యత్ తరాలవాళ్లు చరిత్ర తెలుసుకోవడానికి వీలుగా స్టడీ సెంటర్, రాముని విశేషాలతో పెద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తారు. రామాయణంలోని అతి ముఖ్యులైన హనుమంతుడు, లక్ష్మణుడు వంటి దేవతలకు ఆలయాలు కడతారు. రోజూ వేలాది మంది రాకపోకలు సాగించడంవల్ల టూరిజం ఇండస్ట్రీకికూడా లాభం వస్తుంది. రామ్‌లాలా విగ్రహాలకు అలంకరించడంకోసం ప్రత్యేకంగా బట్టలు కుడుతున్నారు. ఎరుపు, కాషాయం రంగు బట్టలకు, మెరుపు చమ్కీ అంచును జోడిస్తూ ప్రత్యేక డిజైన్ డ్రెస్‌లు తయారు చేస్తుంటారు అయోధ్యలో. గతంలో చాలా తక్కువగా ఆర్డర్లు వచ్చేవి. సుప్రీం కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చాక రామ్లాలాకి సమర్పించుకోవడానికి భక్తులు ప్రత్యేకంగా ఫోన్లపై ఆర్డర్లు ఇస్తున్నారట! అంతేకాదు, రామచంద్రుడికి వేసవి కాలంలో ఉక్కపోయకుండా, శీతాకాలంలో చలి వేయకుండా స్పెషల్ క్లాత్‌తో డ్రెస్‌లు కుట్టడం అయోధ్య టైలర్ల ప్రత్యేకత. దీనికోసం ముఖమల్ బట్టని వాడతారు. ఇక, సాకేత సార్వభౌముడైన రాముడు తొడిగిన బట్ట తొడగకుండా రోజుకో రకం దుస్తులు ధరిస్తాడని నమ్మకం. అందుకోసం ఆదివారంనాడు గులాబీ రంగు, సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నీలం రంగుల్లో రామ్‌లాలా దుస్తులు తయారు చేస్తారు. వీటికోసం లోకల్‌గా పనిచేసే కుటుంబాలవాళ్లకు గతంలో వీళ్లకు నెలకు పది పదిహేను ఆర్డర్ల కంటే ఎక్కువ వచ్చేవి కావట! టెక్నాలజీ పెరగడంతో ఫోన్ లేదా వాట్సప్‌ల ద్వారా ఆర్డర్లు ఇచ్చేసి తయారు చేయించుకుంటున్నారు. పేమెంట్ ఇబ్బంది లేకుండా రకరకాల ఆన్లైన్ యాప్‌ల నుంచి పంపించేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే… రామకోటి, తులసీ రామాయణం, వాల్మీకి రామాయణం సంపుటాలు, హనుమాన్ చాలీసా తదితర ఆధ్యాత్మిక పుస్తకాలకు డిమాండ్ ఉంటుంది. అయోధ్యలో కొనుక్కున్న పుస్తకాలకు సెంటిమెంట్‌ను జోడించుకుని, పవిత్రంగా భావిస్తారు.
ట్రస్టీలందరూ
అయోధ్యలో రామమందిరానికి అన్ని అరెంజ్మెంట్లు మొదలయ్యాయి. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం గడువు నాలుగు రోజులుండగానే ‘శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ఏర్పాటైంది. దీనిలో రామ్‌లాలా తరఫున వాదించిన సీనియర్ లాయర్ పరాశరన్ ఇంట్లోనే ట్రస్ట్ హెడ్క్వార్టర్స్కూడా ఉంటుంది. ట్రస్ట్ పూర్తిగా ధార్మికంగానే పనిచేస్తుంది. ఇందులో మెంబర్లెవరికీ జీతాలుండవు. ట్రస్ట్ ఆస్తులపై కూడా ఎలాంటి హక్కులు ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే, ట్రస్ట్ మెంబర్లందరూ రాముడి తరఫున సేవకులుగా పనిచేస్తారు. తొమ్మిది రూల్స్ ప్రకారం ఇది పని చేస్తుంది.
రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ఈ ట్రస్ట్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ప్రతి నిర్ణయాన్ని సొంతంగానే తీసుకుంటుంది. నిర్మాణ స్థలంలో భక్తులకు వంటశాల, గోశాల, మ్యూజియం, ధర్మసత్రం వంటి ఏర్పాట్లనుకూడా ట్రస్ట్ చూసుకుంటుంది.
చట్టబద్ధంగానే విరాళాలు, గ్రాంట్లు, స్థిరాస్తులు వంటివి తీసుకునే వీలును ట్రస్ట్‌కి కల్పించారు. అలాగే, రామ మందిర నిర్మాణానికి, సదుపాయాల కల్పనకు ఏదైనా సంస్థ లేదా వ్యక్తుల సహాయం తీసుకోవడానికికూడా ట్రస్ట్‌కి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
ట్రస్ట్ సమావేశాల నిర్వహణకోసం ఒక ప్రెసిడెంట్–మేనేజింగ్ ట్రస్టీ, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ ఉంటారు. వీళ్లను ట్రస్ట్ సభ్యులే తమ సభ్యుల నుంచి ఎంచుకుంటారు.
నిధులను ఖర్చు చేయడం, నిధుల సేకరణ మొత్తం ట్రస్ట్ పేరుమీదనే జరుగుతుంది.
ట్రస్ట్‌కి సేకరించే విరాళాలను ట్రస్ట్ కార్యక్రమాలకోసం తప్ప, ఇతర పనులకు వాడకూడదు.
రామ మందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి చెందిన స్థిరాస్తులు వేటినీ ట్రస్టీలు అమ్మడానికి వీల్లేదు.
విరాళాలు, ఖర్చుల వివరాలను పక్కాగా రికార్డు చేయాలి. బ్యాలెన్స్ షీటు తయారు చేయాలి. ట్రస్ట్ ఖాతాలను ఆడిట్ చేయించాలి.
రోజూ 15వేల మందికి పైగా..
రామ మందిరం నిర్మాణం మొదలు కాకపోయినా, ఇప్పటికే రోజూ 15,000 మంది వరకు భక్తులు వస్తూ తమ భక్తిశ్రద్ధలు చాటుకుంటున్నారు. దేశంలోని అన్ని దేవాలయాల దగ్గర ఉన్నట్లే అయోధ్య లోనూ పూల దండలు, ప్రసాదాలు అమ్మే షాపులున్నాయి. ప్రత్యేకంగా యాలుకలతో చేసిన చిన్న చిన్న పంచదార ఉండలు, మిస్రీ (పటికబెల్లం బిళ్లలు) ప్యాకెట్లలో అమ్ముతారు. ఇవికాకుండా లడ్డూలు, పల్లీ
చిక్కీలుకూడా కొనుక్కునేవారుంటారు.