శ్రీరామనవమి ముహూర్తం ఖరారు

శ్రీరామనవమి ముహూర్తం ఖరారు

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీరామనవమి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ 10న శ్రీసీతారామచంద్ర స్వామివారి కళ్యాణం జరుగనుంది. ఏప్రిల్ 11న స్వామివారి పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. మిథిలా స్టేడియంలోనే యావన్మంది భక్తుల సమక్షంలో శ్రీరామనవమి వేడుకలు జరిగేలా వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంది.