హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కారు విద్యాసంస్థల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల(ఎస్ఎంసీ) ఎన్నికలు నిలిచిపోయాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఎస్ఎంసీల ఎలక్షన్లు పెట్టొద్దని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పాత కమిటీలను మంగళవారం మధ్యాహ్నంతో రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అయితే, ఎస్ఎంసీ కొత్త కమిటీల ఎన్నికలను నిలివేయడం టీచర్లలో చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ఎన్నికలు జరగాల్సి ఉంది. తాజా ఉత్తర్వులతో పాత కమిటీలే మళ్లీ కొనసాగే అవకాశం ఉంది. రెండేండ్ల కాలపరిమితితో 2019లో ఎస్ఎంసీ కమిటీలను ఏర్పాటు చేశారు. అవే ఇంకా కొనసాగుతున్నాయి.
