కోలీవుడ్‌‌‌‌లో క్రేజీ చాన్స్ కొట్టేసిన శ్రీదేవి

కోలీవుడ్‌‌‌‌లో  క్రేజీ చాన్స్ కొట్టేసిన శ్రీదేవి

‘కోర్ట్‌‌‌‌’ చిత్రంతో టాలీవుడ్‌‌‌‌లో మంచి ఫేమ్ తెచ్చుకున్న  శ్రీదేవి అపల్లా ప్రస్తుతం   వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది.  తెలుగుతోపాటు తమిళంలోనూ బిజీ  కాబోతోంది. ఇప్పటికే తమిళంలో ఓ సినిమాలో నటిస్తుండగా,  తాజాగా మరో  క్రేజీ చాన్స్ అందుకుంది.  

కోజిపన్నై చెల్లదురై,  కానా కానమ్ కాలంగల్  వంటి  చిత్రాలతో తమిళనాట మంచి గుర్తింపును తెచ్చుకున్న ఏగన్‌‌‌‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో శ్రీదేవిని  హీరోయిన్‌‌‌‌గా సెలెక్ట్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ఆమెతో పాటు ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ కూడా  ఈ చిత్రంలో మరో హీరోయిన్‌‌‌‌గా నటించబో తున్నట్టు అనౌన్స్ చేశారు. 

‘ఆహా కళ్యాణం’ ఫేమ్  యువరాజ్ చిన్నసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  కోలీవుడ్‌‌‌‌లో రీసెంట్‌‌‌‌గా ‘జో’ మూవీతో  బ్లాక్ బస్టర్ హిట్‌‌‌‌ను నిర్మించిన  విజన్ సినిమా హౌస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.   విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.