శ్రీకాకుళం జిల్లాకు తప్పిన Fani ముప్పు

శ్రీకాకుళం జిల్లాకు తప్పిన Fani ముప్పు

శ్రీకాకుళం జిల్లాకు ఫొని తుఫాన్ ముప్పు తప్పిందని జిల్లా కలెక్టర్ నివాస్ చెప్పారు.  జిల్లాకు దూరంగా తీరం దాటడంతో పెను ముప్పు తప్పినట్టేనని అన్నారు.తుఫాన్ తర్వాత వరదలు వచ్చే  అవకాశమున్నందున అందరూ  అలర్ట్ గా ఉండాలన్నారు. కొన్ని చోట్ల విద్యుత్ స్తంబాలు పడిపోయినట్లుగా సమాచారం వచ్చిందన్నారు. జిల్లాల్లో ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరిగినట్లు రిపోర్టు రాలేదన్నారు.  వంశధార,బహుద నదుల్లో వరదలు వచ్చే అవకాశముందున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.