స్విస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ 300 టోర్నీలో శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌తోనే సరి

స్విస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ 300 టోర్నీలో శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌తోనే సరి

బాసెల్‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌.. స్విస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ 300 టోర్నీలో సెమీస్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిముఖం పట్టాడు. శనివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ 21–15, 9–21, 18–21తో లిన్‌‌‌‌‌‌‌‌ చున్‌‌‌‌‌‌‌‌ యి (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ) చేతిలో ఓడాడు. గంటా 5 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. 

తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ ఈజీగా నెగ్గిన శ్రీ రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లోనూ 4–1 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. కానీ లిన్‌‌‌‌‌‌‌‌ కొట్టిన క్రాస్‌‌‌‌‌‌‌‌ కోర్టు విన్నర్స్‌‌‌‌‌‌‌‌ తీయలేక ఇబ్బందులు పడ్డాడు. ఇక డిసైడర్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ రిథమ్‌‌‌‌‌‌‌‌ అందుకున్న శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ వరుసగా పాయింట్లు నెగ్గాడు. ఓ దశలో ఇద్దరు 16–16తో సమంగా నిలిచారు. కానీ నెట్‌‌‌‌‌‌‌‌ వద్ద మెరుగైన డ్రాప్స్‌‌‌‌‌‌‌‌ వేసిన లీ మూడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు.