శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్ వర్షార్పణం

శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్ వర్షార్పణం

బ్రిస్టల్‌: శ్రీలంక-బంగ్లాదేశ్‌ టీమ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షార్పణంగా నలిచింది. మంగళవారం మధ్యాహ్నం​ గం.3.00ని.లకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించింది. పిచ్‌ను, ఔట్‌ ఫీల్డ్‌ను కవర్లతో​ కప్పి ఉంచారు. వర్షం తగ్గితే ఓవర్లకు కుదించి మ్యాచ్ ను స్టార్ట్ చేద్దామనుకున్నారు. అయితే వర్షం కంటిన్యూగా రావడంతో.. మ్యాచ్‌ టాస్‌ వేయకుండానే క్యాన్సిల్ చేశారు అంపైర్లు. రెండు టీమ్స్ కు చెరో పాయింట్ ఇచ్చారు.

ఈ మ్యాచ్ లో గెలిచే టీమ్ టోర్నీలో కాస్త మెరుగైన స్థానంలో నిలిచేది. ప్రస్తుతం శ్రీలంక నాలుగు మ్యాచులతో నాలుగు పాయింట్లు సాధించింది. బంగ్లాకు 4 మ్యాచులతో 3 పాయింట్లు కైవసం చేసుకుంది.  టోర్నీలో ఇంకా ఈ రెండు జట్లకు మిగిలినవి ఐదు మ్యాచులే. అవీ కఠినమైన జట్లతో ఉండనున్నాయి. ప్రస్తుత మ్యాచ్‌ రద్దు కావడంతో టోర్నీ చివర్లో పరిస్థితులు ఈ జట్లకు సంక్లిష్టంగా మారొచ్చు.

వర్షం కారణంగా శ్రీలంక-పాకిస్తాన్‌ మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ మ్యాచ్‌ సైతం రద్దయిన సంగతి తెలిసిందే. వర్షాలు ఇలాగే పడితే పలు జట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.