
పల్లెకెలె: శ్రీలంక పర్యటనలో ఇండియా విమెన్స్ టీమ్ మరో సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగే రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అదే సమయంలో తమ ఓపెనర్లు నిలకడగా ఆడాలని కోరుకుంటోంది. టీ20 సిరీస్ నెగ్గిన తర్వాత లో స్కోరింగ్ తొలి వన్డేలోనూ గెలిచింది. కానీ, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, యంగ్‌స్టర్ షెఫాలీ వర్మ ఫామ్‌పై జట్టు ఆందోళన చెందుతోంది. ఈ ఇద్దరు బ్యాటర్లు శుభారంభాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. కామన్వెల్త్ గేమ్స్‌లో టీ20లకు సమయం దగ్గరపడుతున్న వేళ వీళ్లు గాడిలో పడాలని జట్టు ఆశిస్తోంది.