ఒక స్టెప్ కోసం 30 టేకులు.. సారీ చెప్తూ లేఖ రాసిన శ్రీలీల

ఒక స్టెప్ కోసం 30 టేకులు.. సారీ చెప్తూ లేఖ రాసిన శ్రీలీల

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీలనే(Sreeleela). ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అది కూడా కేవలం తెలుగులోనే అవడం విశేషం. ఆ లిస్టులో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఉన్నారు. అందులో ఒకరు రామ్ పోతినేని(Ram pothineni). శ్రీలీల, రామ్ జంటగా చేస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద(Skanda). మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati srinu) తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల మునుకు రానుంది. ఇందులో భాగంగా శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె  స్కంద సినిమా గురించి, తన బాల్యం గురించి, డాన్స్ పై తనకున్న మక్కువ గురించి చెప్పుకొచ్చింది. 

చిన్నప్పటి నుండి మా అమ్మ చెప్పడం వల్లే భరత నాట్యం నేర్చుకున్నాను. అలా డ్యాన్స్ పై ఇష్టం పెరిగింది. స్కూల్లో ఏదైనా ప్రొగ్రామ్‌ జరిగితే మొదట నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండేది. ఇక సినిమాలోకి వచ్చాక అది చాల హెల్ప్ అయ్యింది. అయితే మొదటి సినిమాల్లో డాన్స్ చేయడంలో కాస్త ఇబ్బంది పడ్డాను. ఒక సినిమాలో ఒక స్టెప్ కోసం ఏకంగా 30 టేకులు తీసుకున్నాను. అందుకు శేఖర్ మాస్టర్ కు సారీ చెప్తూ లెటర్ కూడా రాసాను. షూటింగ్‌లో ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం వల్ల సమయంతో పాటు నిర్మాతకు ఖర్చు పెరుగుతుంది. అలా పాట కోసం ఎన్ని సార్లు రిహార్సల్స్‌ చేసినా అది ఓకే కాలేదు. అలా ముప్పై టేక్స్‌ తీసుకోవడం చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి సారీ చెబుతూ శేఖర్ మాస్టర్‌కు లేఖ రాసాను. దానికి ఆయన అందులో ననీ తప్పేం లేదంటూ రిప్లై కూడా ఇచ్చాడు. శేఖర్ మాస్టర్‌ అలా చెప్పడంతో కొంచెం సంతృప్తి  అనిపించిందని చెప్పుకొచ్చింది శ్రీలీల.