
తెలుగులో ఉన్న అతికొద్ది మంది స్టార్ యాంకర్ లలో శ్రీముఖి(SreeMukhi) ఒకరు. తనదైన టాకింగ్ పవర్ తో ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేయడం ఆమెకు అలవాటే. ప్రముఖ ఛానెల్ లో ప్రసారమైన అదుర్స్ తో యాంకర్ గా తొలి అడుగువేసి శ్రీముఖి.. కొద్దికాలంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగారు.
ప్రస్తుతం ప్రముఖ ఛానెల్స్ లో ప్రసారమవుతున్న చాలా షోస్ కి శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతుంది. ఓవైపు యాంకర్ గా ఫుల్ బిజీగా ఉంటూనే..మధ్య మధ్యలో సినిమాల్లో కనిపిస్తూ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
తాజాగా శ్రీముఖి గ్రీన్ శారీలో అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.నీతోనే డ్యాన్స్ 2.0 షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి..ఈ షోో కోసం అందాల బొమ్మలా తయారైంది.ఈ ఫోటోలు షేర్ చేయగానే కుర్రాళ్ల మతులు ఒక్కసారిగా తనవైపు తిప్పుకునేలా చేసింది. గ్రీన్ ఆపిల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే గార్జియస్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.చిలకపచ్చ చీరకట్టులో సొగసైన ఫోజులు ఇస్తోంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటించిన శ్రీముఖి ఖుషీ నడుము సీన్ ను రీక్రియెట్ చేసి స్క్రీన్ పై రచ్చ రచ్చ చేసింది. ఇక అప్పటినుండి మరో సినిమాలో కనిపించని శ్రీముఖి.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
also read : రక్తపాతంతో విశాల్ రత్నం ట్రైలర్..ప్రేమ కోసం యాక్షన్ ప్యాక్డ్ అదిరిపోయింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది ఈ కాంబో. నిజానికి దర్శకుడు అట్లీ సినిమాల్లో ఆడవాళ్ళ పాత్రలకి మంచి ప్రాముఖ్యత ఉంటుంది.
అలాగే అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో కూడా అల్లు అర్జున్ చెల్లిగా ఒక ప్రత్యేకమైన పాత్రను రాశాడట అట్లీ. ఆ పాత్రం కోసం, శ్రీముఖిని తీసుకోనున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.