జనాభా దామాషా ప్రకారంబీసీలకు సీట్లు ఇయ్యాలె : జాజుల శ్రీనివాస్​గౌడ్

జనాభా దామాషా ప్రకారంబీసీలకు సీట్లు ఇయ్యాలె : జాజుల శ్రీనివాస్​గౌడ్

ఖైరతాబాద్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఎంపీ టికెట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్​గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సబ్బండ వర్గాలకు రాజకీయ వాటా దక్కినప్పుడే అసలైన సామాజిక న్యాయం జరిగినట్టు అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు బీఆర్ఎస్​6, బీజేపీ 5 సీట్లు ఇచ్చాయని, కాంగ్రెస్​ అంతకంటే ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరారు.

రాహుల్​గాంధీ బీసీలకు పెద్దపీట వేయాలంటుంటే, రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గానికి ప్రధాన్యం ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నామినేటెడ్​పోస్టుల కేటాయింపులో బీసీలకు రావాల్సిన వాటాను ఎందుకు ఇవ్వలేదని, 5 శాతం లేని వారికి 90 శాతం పదవులు ఇవ్వడం న్యాయమా అంటూ సీఎం రేవంత్​ను జాజుల ప్రశ్నించారు. బీఆర్ఎస్ ది​ దొరల పాలనైతే.. కాంగ్రెస్ ది పటేళ్ల పాలన అని విమర్శించారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్​ కుందారం గణేష్​చారి, విద్యార్థి సంఘాల జాతీయ అధ్యక్షుడు విక్రం గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.