బడులు బంద్ పెట్టడం ఒక కుట్ర

బడులు బంద్ పెట్టడం ఒక కుట్ర
  • బడులు బంద్ పెట్టడం ఒక కుట్ర
  • ఆన్‌లైన్‌తో విద్యార్థులకు లాభం లేదు

హైదరాబాద్: కరోనా పేరు చెప్పి బడులు బంద్ పెట్టడం ఒక కుట్ర అని.. స్కూళ్ళలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నామని ట్రెస్మ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి తెలిపారు. నాలుగు నెలల్లో విద్యాసంస్థల్లో పెద్దగా కేసులు వచ్చింది లేదన్నారు. ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్‌లు, శానిటైజేషన్ వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బార్లు, వైన్స్, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ తెరిచి స్కూళ్లు బంద్ పెట్టడం అన్యాయమని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కరోనాతో విద్యా వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయ్యిందన్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి గాడిన పడుతోందన్నారు. మళ్ళీ సెలవుల పేరుతో విద్యార్థులను బడులకు దూరం చేయవద్దని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయం లేదని స్కూళ్ల మీదే ముందుగా పడుతున్నారన్నారు. కరోనా జాగ్రత్తలను మరింత కఠినం చేసి స్కూళ్లను తెరవాలని.. ఆన్‌లైన్‌తో విద్యార్థులకు లాభం లేదని శ్రీనివాసరెడ్డి పేర్కన్నారు.

వరుసగా...మార్కెట్స్,సినిమా థియేటర్స్, మాల్స్,వైన్స్,బార్స్, క్లబ్స్, ప్రజల కూడిక, పోలిటికల్ మీటింగ్ లేని ఆంక్షలు..అవగాహన ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ...విద్యానందించే విద్యాసంస్థలను  మూసివేయటం, పిల్లల చదువు బందు పెట్టడం చాలా అన్యాయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సెలవుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.