తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి

తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి

తిరుమల : శ్రీ రామ నవమి సందర్భంగా  తిరుమల శ్రీ వారి ఆలయంలో ఆస్థాన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ దేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారితో పాటు సీతా రాముల విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.  పాలు, పెరుగు, తేనే, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో శాస్త్రోక్తంగా అభిషేకించారు అర్చకులు. ఇవాళ రాత్రి మలయప్ప స్వామి హనుమంత వాహనంపై మాడ వీధులలో ఊరేగనున్నారు. తర్వాత శ్రీ వారి బంగారు వాకిలి చెంత శ్రీ రామనవమి ఆస్థాన వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.