రేపటి(మార్చి 1) నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

రేపటి(మార్చి 1) నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

కొలిచే వారి కొంగుబంగారం శ్రీశైల మల్లన్న. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. భక్తవ శంకరుడు , భోళా శంకరుడు అయిన ఆ మల్లికార్జున స్వామి భక్తులకు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రం ముస్తాబవుతోంది.

బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ కారణంగా అందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శినానికి మాత్రమే అనుమతిస్తారు. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు 1 నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు నిలిపేశారు.

also read :  అహోబిలం నరసింహస్వామికి తెలంగాణ ప్రభుత్వ పట్టు వస్త్రాలు
 

మార్చి 5 వ తేదీ సాయంత్రం 7:30 నుంచి 11వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్ లైన్, కరెంట్ బుకింగ్ కి ఏర్పాట్లు చేశారు అధికారు.