బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తం : శ్రీశైలం గౌడ్

బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తం : శ్రీశైలం గౌడ్

జీడిమెట్ల, వెలుగు : బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్​ తెలిపారు. ఎన్నికల  ప్రచారంలో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న కార్మికుల కష్టాలు చూసిన తర్వాత వారికి అండగా ఉండేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ఏ ఒక్క హమీని నెరవేర్చలేదన్నారు.

కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. నిజాంపేట పరిధి బాచుపల్లిలోని నందనవనం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీశైలంగౌడ్​కు మద్దతుగా బీజేపీ సీనియర్ నేత మురళీధర్ ​రావు, చీకోటి ప్రవీణ్​, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్​ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నిజాంపేట​​ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు.