శ్రీశైల దేవస్థానం హుండీ ఆదాయం రూ.4.69కోట్లు

శ్రీశైల దేవస్థానం హుండీ ఆదాయం రూ.4.69కోట్లు
  • గతంలో కంటే భారీగా పెరిగిన ఆదాయం
  • భక్తుల రద్దీతో దేవస్థానానికి పూర్వ వైభవం

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో ఉభయ దేవాలయాలకు ఆదాయం భారీగా పెరిగింది. కరోనా కు పూర్వం  నాటి పరిస్థితి ఏర్పడినట్లు ఆదాయం స్పష్టం చేస్తోంది. గత 39 రోజులుగా హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. సీసీ కెమెరా నిఘా నడుమ పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పకడ్బందీగా హుండీ నగదు లెక్కించారు. వందల మంది ఉద్యోగులు, సిబ్బంది, శివసేవకులు హుండీ ఆదాయం లెక్కింపులో పాల్గొన్నారు. 
గత 39 రోజుల హుండీ ఆదాయం 4 కోట్ల 69 లక్షల 85 వేల 974 రూపాయల నగదుతోపాటు 333 గ్రాముల బంగారం మరియు 8 కిలోల వెండి ఆభరణాలు వచ్చాయి. అలాగే 159 అమెరికా డాలర్లు, 15 కెనడా డాలర్లు, 1500 యూరోలు, 115 ఇంగ్లండ్ డాలర్లు, 13 కువైట్ దిర్హమ్ లు, 3 కతార్ రియాల్స్, 2 సింగపూర్ డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీలలో వచ్చింది.