శ్రీశైలంలో కార్తీక మాస సందడి.. భక్తులతో క్యూలైన్లన్నీ కిటకిట

శ్రీశైలంలో కార్తీక మాస సందడి.. భక్తులతో క్యూలైన్లన్నీ కిటకిట

కార్తీక మాసం సందర్భంగా శ్రీశైల క్షేత్రం భక్తుల సందడి ఏర్పడింది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు పాతాళగంగ వద్ద పుణ్య స్నానాల కోసం వేకువ జాము నుండే బారులు తీరారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు గంగమ్మ ఒడిలో దీపాలు విడిచి మొక్కులు తీర్చుకున్నారు.

ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీశైల క్షేత్రంలో ఎటు చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. ఆలయ పరిసరాల్లో.. పాతాళగంగ వద్ద.. కార్తీక దీపారాధన చేస్తూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. దర్శనం కోసం అర్ధరాత్రి నుండే భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గంటల తరబడి వేచి ఉంటున్న భక్తులకు దేవస్థానం వారు అల్పాహారం.. పాలు.. మజ్జిగ ప్రసాదాలు అందజేస్తున్నారు. సామూహిక అభిషేకాల టికెట్లన్నీ ముందే బుక్ అయిపోతుండడంతో రెండు విడుతలుగా అభిషేకాలు చేసుకునే అవకాశం కల్పించినా.. రెండు పూటలా భక్తుల రద్దీ తగ్గడం లేదు. క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి స్వామి, అమ్మవారి దర్శనాలకి ఐదారు గంటలకు పైగా సమయం పడుతోంది.

 

 

 

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి