జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా సృజన, వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు

జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా సృజన, వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా ఇద్దరు ఐఏఎస్ అధికారులు జి.సృజన, వినయ్ కృష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్​లో వీరు చార్జ్ తీసుకున్నారు. వినయ్ కృష్ణారెడ్డి మల్కాజ్‌గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లను మానిటరింగ్ చేయనున్నారు. 

జి.సృజన కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్ల కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఇద్దరు అధికారులు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్​ను కలిశారు. ఇకపై వీరు తమకు అప్పగించిన జోన్లపై రెగ్యులర్గా పర్యవేక్షణ చేపట్టనున్నారు.