ఐటీ విచారణకు హాజరైన మల్లారెడ్డి కాలేజీల సిబ్బంది

ఐటీ విచారణకు హాజరైన మల్లారెడ్డి కాలేజీల సిబ్బంది

మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పన్ను ఎగవేత ఆరోపణల కేసులో ఇన్‌‌‌‌కం‌‌‌ టాక్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. నిన్న కంపెనీల డైరెక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు సహా 12 మందిని ప్రశ్నించిన అధికారులు తాజాగా  మరికొందరిని విచారిస్తున్నారు. ఇవాళ మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల సిబ్బంది ఒక్కొక్కరుగా బషీర్బాగ్లోని ఇన్ కం ట్యాక్స్ ఆఫీసుకు హాజరవుతున్నారు.

నోటీస్ కాపీలను తీసుకొని ఇప్పటి వరకు 9 మంది ఐటీ కార్యాలయానికి వచ్చారు. వారిలో మల్లారెడ్డి ఆడిటర్ సీతారామయ్య, ఉద్యోగి జె.రవికాంత్, ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్ వీఏ నారాయణ, బీవీ అశోక్, మెడకల్ కాలేజీల ప్రిన్సిపాల్స్ డా. వాకా మురళీ మోహన్, డా. కేఎస్ రావు, అకౌంట్స్ ఆఫీసర్లైన  వి. శ్రీనివాస్, బి. రాజేశ్వర్ రెడ్డితో పాటు మరో అకౌంటెంట్ ను అధికారులు ఇవాళ ప్రశ్నించనున్నారు.