బట్టలపై మరకలు చిటికెలో ఇలా మాయం

బట్టలపై మరకలు చిటికెలో ఇలా మాయం

కరోనా వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో శానిటైజర్ ఒకటి. దాంతో చేతులు మాత్రమే కాదు బట్టలు కూడా శుభ్రం చేయొచ్చు. ఇంక్, పెయింట్ మరకలు ఈజీగా పోగొట్టొచ్చు. పిల్లలకు బళ్లు తెరిచారు. ఇక నుంచి ఇంక్ మరకల తలనొప్పి మొదలవుతుంది. అలాంటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే బెటర్.

ALSO READ :బోడకాకరలో 16 విటమిన్స్ ఉంటాయి.. ఇవి తింటే శక్తి తగ్గనే తగ్గదు

* ఇంక్ మరకలు పోగొట్టాలంటే మరకలపై హ్యాండ్ శానిటైజర్ పూసి టూత్ బ్రష్తో రుద్దాలి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ వేసి పావుగంట ఉంచి తరువాత వేడి నీళ్లలో నానబెట్టాలి. ఆ తరువాత ఉతికితే మరకలు పోతాయి.

• పెయింట్ మరకల మీద హ్యాండ్ శానిటైజర్ లేదా ఆల్కహాల్ రాయాలి. నూనె మరకలు పోవాలంటే నిమ్మచెక్కతో రుద్దితే సరిపోతుంది.

• రక్తపు మరకలు తొలగించేందుకు ఉప్పు వాడాలి. ఉప్పునీళ్లలో రక్తపు మరకలున్న బట్టల్ని పావుగంట నానబెట్టి ఆ తరువాత ఉతకాలి.