బోడకాకరలో 16 విటమిన్స్ ఉంటాయి.. ఇవి తింటే శక్తి తగ్గనే తగ్గదు

బోడకాకరలో 16 విటమిన్స్ ఉంటాయి.. ఇవి తింటే శక్తి తగ్గనే తగ్గదు

సీజనల్ గా దొరికే కూరగాయల్లో బోడకాకర ఒకటి. దీన్ని తెలుగులో బొంత కాకర, ఆగాకర, అడవికాకర అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది.

• ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫైబర్, విటమిన్-బి1, బి2, బి3, బి5, బి6, బి9, బి12, విటమిన్ ఎ, సి, డి2, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, జింక్ యాంటీఆక్సిడెంట్స్ లాంటి పోషకాలు ఎక్కువ. ఈ పోషకాలు శరీరాన్ని ఫిట్ గా ఉంచి, అనారోగ్యం నుంచి కాపాడతాయి.

• తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గును బోడకాకర తగ్గిస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.

• ఇందులో పీచు పదార్థాలు ఎక్కువ. ఇది రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించి. డయాబెటిస్కి మందులా పని చేస్తుంది.

• వర్షాకాలంలో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కాపాడుతుంది. ఇందులోని ఫోలేట్ శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

• బోడకాకర తింటే పక్షవాతం, కంటి సమస్యలు, బీపీ, క్యాన్సర్ వంటివాటిని నివారించొచ్చు.

• ఇందులోని ఫ్లేవనాయిడ్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి ముఖంపై ముడతలు రాకుండా చేస్తాయి.

• ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

• గర్భిణీలు ఈ కాకర తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి మంచిది.