
కంపెనీలు భద్రతా నియమాలు పాటించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. జీరో యాక్సిడెంట్ ఫ్యాక్టరీలుగా ప్రమాణాలు పెంచాలని.. లేదంటే రెడ్ క్యాటగిరీ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. గురువారం (సెప్టెంబర్ 11) పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో MCR HRD సమావేశాని ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్.. కెమికల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఉద్యోగ భద్రతపై ట్రైనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించారు.
ఇండస్ట్రీలో సేఫ్టీపై అధికారులు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. పాశమైలారం సిగాచి పరిశ్రమల పరిస్థితి ఏమైందో అందరికి తెలుసుననీ.. యజమానులకు ఇది ఒక కేస్ స్టడీ కావాలని సూచించారు. డైరెక్టరీస్ ఆఫ్ ఫ్యాక్టరీ ఈ ఘటనకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. ఎక్కడ సమస్యలు, లోపాలు ఉన్నాయో మానేజ్మెంట్ దృష్టి కి తీసుకెళ్ళిందని అన్నారు.
సిగాచి పరిశ్రమలో భద్రతకు అవసరమయ్యే ఖర్చు రూ.20 లక్షల కంటే ఎక్కువ దాటాదని చెప్పారు మంత్రి వివేక్. మేనేజ్మెంట్ తో పాటు బోర్డు సభ్యుల నిర్లక్ష్యం కూడా ఉంటుందని అన్నారు. 20 లక్షలతో సేఫ్టీ మీద దృష్టి పెట్టకపోవడంతోనే సిగాచి ప్రమాదంలో 53 మంది చనిపోయారని అన్నారు.
కంపెనీలో సేఫ్టీ ఎన్విరామెంట్ ఉన్నపుడే.. వర్కర్స్ పని చేయగలుగుతారని అభిప్రాయపడ్డారు మంత్రి. మేనేజనెంట్ ఎప్పుడూ వర్కర్ సేఫ్టీ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలని.. ఆ వాతావరణం కల్పిస్తే మంచి ప్రొడక్టివిటీ పెరుగుందని తెలిపారు.
ట్రైనింగ్ కార్యక్రమానికి ఇంత మంది రావడం గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అని అభినందించారు. మానేజ్మెంట్, వర్కర్స్ ఇనిషియేటివ్ కంటే సేఫ్టీ అధికారుల పాత్ర ముఖ్యమని తెలిపారు. రాజకీయంగా కూడా సమస్యలు వస్తాయని.. ఎదో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా చెప్పారు.
ఏదన్న ప్రమాదం జరిగితే డిపార్ట్ మెంట్ ను బద్నాం చేస్తారని.. కాబట్టి పూర్తి స్థాయిలో సేఫ్టీ మీద దృష్టి పెట్టి మార్పులు చేయాలని సూచించారు. ఫ్యాక్టరీస్ భద్రతపై రిఫార్మ్స్ తేవాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీలో పని చేసే వర్కర్ల భద్రతపై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతి నెల వర్కర్స్ కు సేఫ్టీ మీద కొంత సమయం కేటాయించి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి కెమికల్, ఫార్మసూటికల్ కంపెనీల రిప్రెసెంటేటివ్స్, ITI కాలేజి ప్రిన్సిపల్స్ హాజరయ్యారు.