- నిలోఫర్ లో న్యూ బార్న్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం
మెహిదీపట్నం, వెలుగు: ప్రాథమిక దశలోనే రోగాలను గుర్తించేందుకు న్యూ బార్న్ స్క్రీనింగ్ ఎంతగానో దోహదపడుతుందని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. గురువారం నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో న్యూ బార్న్ స్క్రీనింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పుట్టిన శిశువుకు స్క్రీనింగ్ పరీక్షను తప్పనిసరిగా చేయాలని, జన్యుపరమైన లోపాలను సకాలంలో గుర్తిస్తే ప్రాణాలకు ముప్పు ఉండదన్నారు.
జన్యుపరమైన వ్యాధులను అరికట్టెందుకు స్క్రీనింగ్ తోడ్పడుతుందన్నారు. పుట్టిన బిడ్డ ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాడో తెలుసుకుని తద్వారా శిశువుకు అందించాల్సిన పోషకాలు, మందులను అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, డాక్టర్ అలివేలు, సీఎస్ఆర్ ఎంఓ డాక్టర్ జ్యోతి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి, మెడికల్ జెనెటిక్స్ డాక్టర్ శిల్పారెడ్డి, డాక్టర్ అనిత, సిబ్బంది పాల్గొన్నారు.
