
కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మెహరించారు. ఉదయం నుంచే బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు కంట్రోల్ సెంటర్ కి వచ్చే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో బీజేపీ నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులు.. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ దాడులను నిరసిస్తూ ముట్టుడికి పిలుపునిచ్చారు. పోలీసులు కూడా TRSకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.