అనాధలంతా ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి

అనాధలంతా ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి

అనాధలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు మాజీ ఎంపీ, రాష్ట్ర బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామి.  తల్లిదండ్రులు లేని అనాధాలకు కల్చర్ లేకుండా పోతుందని,  అది కాపాడే బాధ్యతను ఫౌండేషన్‌లు తీసుకోవాలన్నారు. వారిని ఆదుకోవడానికి వెంకటస్వామి ఫౌండేషన్ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. హైదరాబాద్ నాగోల్ లోని జె-కన్వెన్షన్ లో.. రెండో రోజు కొనసాగుతున్న ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్.. కమ్యూనిటీ ఎంపవర్ మెంట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు వివేక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహారాష్ట్రలో అమృత అనే అనే అనాధ యువతి ప్రభుత్వంపై పోరాటం చేసి కోట్లాది అనాధల కోసం 1 పర్సెంట్ రిజర్వేషన్ తీసుకువచ్చిందన్నారు వివేక్. ఆమెది గొప్ప విజయమని, అదే స్ఫూర్తితో అనాధలు ముందుకు వెళ్ళాలన్నారు. ఈ వన్ పర్సెంట్ రిజర్వేషన్ అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్  అవ్వాలని అన్నారు. తాను కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

అనాధల సంక్షేమం కోసం స్వచ్చంద సంస్థలతో పాటు పొలిటీకల్ లీడర్లు కూడ ముందుకు రావాలని అన్నారు. జనాభా లెక్కల ప్రకారం అనాధలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తే విదేశాలకు వెళ్లేందుకు, ఇతర ప్రభుత్వ సబ్సిడీలకు వారు అర్హులవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనాధలకు పాటల సీడీ,కీ చైన్లు అందజేశారు వివేక్.